20071029 Monday October 29, 2007

రుధిరాయనమః స్వాహా !

చితిపై పొగలు గక్కుతోన్న నిప్పుల్లో సగం కాలుతోన్న అపురూప సౌందర్యరాశి దేహం. నెత్తురోడుతున్న ఖడ్గంతో ఎదురుగా నిలుచున్న అక్బర్ పాదుషా ఆలం. 'నేను మంచి మాటలు వినే స్థితిలో లేను. నా చెవులు ఇప్పుడు చవులూరించే కత్తుల చప్పుడు కోసమే రిక్కించి ఉన్నాయి. నన్ను ఒంటరిగా వొదిలెయ్యండి. నేనిప్పుడు అమీర్ (తైమూర్) తో ఆత్మ సంధానంలో ఉన్నాను. మంచి గాయకుడిని ఒకడ్ని నా దగ్గిరకి పంపండి. షానామాలో ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకూ నా ముందు బిగ్గరగా చదవమని చెప్పండి... ఒక చక్రవర్తి విజయానికి కీలక సూత్రం అమృతంలో కాదు. రక్తంలో ఉంది. నాకు యుద్దం కావాలి. శాంతి నాకు పనికిరాదు'. పొగలు గక్కుతోన్న చితి నిప్పుల్లో పొరలు పొరలుగా కలిసిపోయాయి అక్బర్ మాటలు. ఎవరీ అక్బర్ పాదుషా ఆలం?!! ------------------- పూర్తి పాఠం కోసం ఇక్కడ చూడండి. http://theuntoldhistory.blogspot.com/ Posted by dearsridhar ( Oct 29 2007, 01:08:01 AM IST ) Permalink