Pretty Poo

All | General | Status | Java | Music | Politics
20110107 Friday January 07, 2011

Naa Thermometer Katha చలి..చలి..చలి..హైదరాబాదులొ గత 40 సంవత్సరాలలో లేనంత చలి.8 డిగ్రీల చలి అంటే నా ముక్కు ఉంటుందా?అసలే నాది తుమ్మితే ఊడే ముక్కు.దెబ్బకి జలుబు అంటుకుంది.జలుబుకి మందు వెస్తే 7 రోజులు,వేయకపొతే వారం రోజులు అన్నవాడెవడో నాకు దొరకితే వాడి ముక్కు పచ్చడయేలా చితక్కొడుతాను.2 వారాలు దాటిపోయింది ఇది పట్టుకొని.పైన చెప్పిన సామెత వల్ల అసలు మందు వేస్కొవాలో లేదో తెలియక అలా కాలక్షేపం చెస్తున్న నన్ను నేనున్నా అంటూ జ్వరం కూడా పట్టుకుంది.దానితో మందు వేస్కోక తప్పని పరిస్థితి.సరే ఇదే సందని వంటని అటకెక్కించేసా.(అంటే రోజూ చెస్తానని అపార్థం చేస్కోవద్దు.ఏదో ఓపిక ఉన్నపుడు,మూడ్ బాగున్నపుడు వారనికి 2,3 రోజులు ఆలా అలా కలయపెడ్తాను)ముసుగు తన్ని మూలుగుతూ పడుకుంటే పాపం ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు?సరే అన్నీ మనకు వేళకు జరిగిపోతున్నాయి.ఇలా సాగుతూ ఉండగా ఒక రోజు సాయంత్రం విపరీతమైన చలి,ఒళ్ళంతా వణుకు పెట్టేసింది.జ్వరం వచ్చిందేమో అని ఎంతో ఆశగా థర్మామీటరు నోట్లో పెట్టుకుంతే 97 చూపించింది.ఇదేంటబ్బా అని మళ్ళీ పెట్టి 5 నిమిషాలైనా తీయకపొతే ఇంక చాలని మా ఆయన లాగేస్కున్నాడు.చిన్న పిల్లలు కార్టూన్లు చూదటానికి పరిగెట్టినట్లు వెళ్ళి తన చెతిలో ఉన్న మీతరు లాక్కుని మరే చుసా.మళ్ళీ ఆశాభంగం.జ్వరం లేదు ఏం లేదు వెళ్ళి వేడి వేడి గా ఉప్మా చేస్కుని రా తిందాం అని ఆర్డరు వేసాడు.ఆ రోజు పడుకున్నానన్న మాటే కాని థర్మామీటరు నన్ను ఎందుకంత మోసంచేసిందో అని ఆలోచిస్తూనే ఉన్నాను. Posted by prettypoo ( Jan 07 2011, 07:30:00 AM IST ) Permalink Comments [0]
Trackback: http://www.sahiti.org/blogs/trackback/prettypoo/Weblog/naa_thermometer_katha