Know the value of one minute..

All | General | Status | Java | Music | Politics
20080219 Tuesday February 19, 2008

రక్షించిన ద్వారము పై రక్తము..!/BLOOD ON THE DOOR. రక్షించిన ద్వారము పై రక్తము..! భయంకర యుద్ద సమయంలో ఓ క్రూర కమాండర్ ఓ గ్రామము లోని ప్రతి ఇంటిలో నివసించే అందరిని చంపాలని నిర్ణయించాడు. తన నిర్ణయాన్ని అమలు పరచాలని తన సైనికులకు అదేశించాడు.ఆ సైనికులు ఇంటిలోని అందరిని చంపినతరవాత ఆ యింటిలో అందరు చంపబడినారు అని గుర్తుగా ఆ యింటి ద్వారము పై రక్తమును చల్లేవారు. దానితొ ఆ యింటిలో అందరు చంపబడినారు అని గుర్తుగా భావించారు. ఈ విషయన్ని గమనించిన ఓ యువకుడు, తాను, తన స్నేహితులు దాగుకొనియున్న ఇంటిలోకి వెళ్ళి, ఇంటిలోనున్న 'మేకాను చంపి దాని రక్తమును ఇంటి ద్వారముపై పూసెను. ఇంతలో అటువచ్చిన సైనికులు ఆ రక్తమును చూచి ఆ ఇంటిలో అందరు చంపబడ్డరన్న తలంపుతో ఆ ఇంటిలోనికి వెల్లకుండా వేరె ఇంటివైపు సాగిపోయారు. అయితే, 'మెకా రక్తముతో పూయబడిన తలుపు గల ఇంటిలోని యువకులు అతని స్నేహితులు మాత్రము మరణము నుండి రక్షింపబడినారు./ తప్పించుకోగలిగారు. నిర్ణయించుకోండి! మీరే గనక అటువంటి యుద్ధ పరిస్తితుల్లో ఉండినట్లైన, 'మెకా తక్తముతో పూయబడిన ఇంటిలో దాగుగొనుటకు ఆలస్యము చేయకుందువు కదా! "మరణము, తీర్పు" అనేవి ప్రతి ఒక్కరికి సంభవించును. అయెతే, తీర్పులోనికి రాకుండా "యేసు" తక్తము ద్వార తప్పింపబడుటకు చాలమంది నిరాకరిస్తున్నారు. బైబిలు చెబుతుంది "పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమా 6:23) మరియు "మరణమైన తర్వాత తేర్పు జరుగును." (హెబ్రీ 9:27) మీయోక్క పాపములకు తగిన శిక్ష ఒక క్రూరమైన యుద్ధ కమాండర్ ద్వార కాదు గాని ఒక నీతిమంతుడైన దేవుడు, పాపమును ద్వేషించే దేవుని నుండి. అయెతే ఆయనే నీవు నీ శిక్షనుండి తప్పింపబడుతకు ఒక చక్కని మార్గమును చూపిస్తున్నాడు. యుద్ధసమయములో తప్పింపబడిన యువకులవలే నీవు కూడ యేసు రక్తము ద్వారా నీవు తప్పింపబడుదువు. ఆయన సమస్త జనముల పాపముల ప్రాయశ్చిత్తమై మరణించెను. నిర్గమకాండము 12వ అధ్యాయములో "నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను." అటువంటి రక్షణార్ధమైన రక్తమును నీవు ఆశ్రయించాలనుకోవడంలేదూ..? "యేసు రక్తము ప్రతిపాపమునుంది మనలను కడిగి పవిత్రపరచును. Posted by dmdas009 ( Feb 19 2008, 01:29:18 PM GMT+05:00 ) Permalink

20080105 Saturday January 05, 2008

ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయించి, ఒక మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తములో తన వస్త్రాలను ఉతుక్కొన్నాడు.అయితే తన విజయోత్సవ ఉచ్చ స్తితిలో నిందినవాడై, తనకు అందించబడిన ముఖ్యమైన సమాచారమును చదువుటకు సమయమివ్వలేక పోయడు. రోమా పార్లమెంటుకు భవనానికి వెల్లుతున్న అతనికి పార్లమెంటు మెట్ల దగ్గర ఓ శత్రువు అతనిని చంపుటకు పొంచియున్నాడు అన్న సమాచారమును ఓ సైనికుడు అందించాడు. అయితే సభకు ఆలస్యం అవుతుందనుకున్న సీజర్ ఆవుత్తరమును చదువుటకు సమ్యమివ్వలేక పోయెను.ఆ వుత్తరమును బెల్టుకింద పెట్టుకొని వెల్లాడు. ఆ వుత్తరం తన ప్రాణమును కాపాడుతుందనుకొలేదు. యధావిధిగా వచ్చిన సీజర్ను శత్రువు మెట్లదగ్గర కత్తితో పొడిచి చంపాడు. చుశారా! ఒక్క నిమిశము సమయము వెచ్చించి ఆ వుత్తరమును చదివి వుండి వుంతె అతను తన ప్రాణమును కాపాడుకొనె వాడు. ఈనాడు అనేకులు సమయం లేదంటు నిర్లక్ష్యముగా వుంటున్నారు. అట్టివారిని గురించి బైబిల్ చెబుతుంది "అట్టివారికి ఆపద హటాత్తుగా తటస్థించును. వారికాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదు." (సామెతలు 24:22) (దా||ఎన్. జయపాల్ గారి "కల్వరి ప్రెమధార" మాసపత్రిక సౌజన్యంతో ......) Posted by dmdas009 ( Jan 05 2008, 01:49:08 PM GMT+05:00 ) Permalink

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers