Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
« 9 - హరిహరపుత్రం | Weblog | మంగళంపల్లి కు ఫ్రెంచి అవార్డు! »
20050406 Wednesday April 06, 2005

త్యాగరాజ ఆరాధన - 2005 రెండువారాల తరువాత మళ్లీ బ్లాగు వ్రాయటానికి వీలు చిక్కింది. గత రెండు వారాంతాలు క్లీవ్లాండ్ వెళ్లాను. అక్కడ జరిగే వార్షిక త్యాగరాజ ఆరాధనకు వెళ్లాను.

గత నాలుగేళ్లగా ఇది నా వార్షిక కార్యక్రమాలలో ఒకటి అయింది. ఈ సంవత్సరం కొంచం బాగా ఆనందించాననిపించింది. ఈసారి ఒక్కడినే వెళ్లటం మూలాన కూడా వచ్చే గ్యాంగుతో కబుర్లు చెప్పకుండా మనసుపెట్టి పాడిన దానిని గమనించడం ఒక కారణమైతే, రెండవ కారణం పది-పదిహేను రాగాల వరకూ కాస్తోకూస్తో నడక పట్టుబడటం.

నేను విన్న కచ్చేరీలు:

అన్నింటిలోకీ శ్రీకంఠన్ గారి గాత్ర కచ్చేరీ నాకు బాగా నచ్చింది. నాకు తెలిసిన ఆరభి, శ్రీ, భైరవి, ఖమాస్, నాయకి, వరాళి, ఆభేరి రాగాలు పాడటం ఒకటి, మరొకటి ఆయన గొంతునుండి వెలువడే చక్కటి భావం, ఆర్తి (రాగాలపనలోనూ, కృతిలోనూ) ఒకటి. ఆయనకు 85ఏళ్ల వయస్సు. అటువంటి వయసులో కూడా గత నాలుగేళ్లగా ఓపికచేసుకొని అమెరికా వచ్చి 3-3.5గం. సేపు కచేరీ చేయటం ఆశ్చర్యం.

శ్రీమతి సుధా రఘునాథన్ కేవలం అన్నమాచార్య కీర్తనలతో 3గం. కచ్చేరీ చేయటం ఒక విశేషం. కీ.శే. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి ఙ్ఞాపకార్ధం, ఆవిడ ప్రాచుర్యంలోకి తెచ్చిన అన్నామయ్య కీర్తనలతో కచ్చేరీ చేసారు.

వేరే విశేషాలకొస్తే, మృదంగ విద్వాన్ శ్రీముష్ణం రాజారావుగారు చాలా సరదాగా పది నిమిషాలసేపు మాట్లాడారు. కానీ తమిళంలో ఉండటం చేత అక్కడక్కడా అర్థమయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కళాకారులు ఖరహరప్రియ, కాంభోజి, భైరవి, శంకరాభరణం వంటి "పెద్ద"రాగాలు బాగా పట్టుబడేట్లు కృషి చేయాలి తప్పించి, చిన్నచితక మారుమూల రాగాలు (గండకప్రియ? వగైరా) వంటివి పాడటానికి ప్రయత్నించకూడదు. విద్వత్తు పెరిగాక కావలంటే అటువంటి ప్రచుర్యంలేని రాగాలు పాడవచ్చు. అసలు హిందోళం రాగంలో పాడితే ఏదో చిన్నతనం భావన కూడా ఉన్నదంటే ఆశ్చర్యపడనక్కరలేదు. నిజమే, మహావృక్షాలు ఎప్పటికీ మహావృక్షాలే.

మరొక పెద్దాయన మాట్లాడుతూ (పేరు తెలియదు, శ్రీ అరైకూడి శ్రీనివాస అయ్యంగారి శిష్యులట), నేటి సంగీత కళాకారులలో భావప్రకటన తగ్గి, ఉచ్ఛారణ తగ్గి కేవలం హెచ్చుగొంతు, తీర్మానాలు, గిమ్మిక్కులు చేయటం ఎక్కువయిందని వాపోయారు.

ఇంకోటి, చివరిరోజు, ఉన్నికృష్ణన్ గాత్రకచ్చేరీ జరుగుతోంది. ఆయనకు ఉన్న ప్రాచుర్యం వలన కొంతకుర్రకారు కూడా వచ్చి నా వెనకాల ఉన్న వరుసలో కూర్చున్నారు. కచ్చేరీ జరిగినంతసేపూ మాటలు, గోల. ఒక కుర్రడయితే తప్పు తాళంతో డబాడబామని కాలూచేయీ బాదుకోవడం. భలే చిరాకేసింది. "ఏం గురూ! ఒంట్లో ఎలాగుంది? ఒళ్లు తిమ్మిరెక్కిందా?" అని నోటి వరకూ వచ్చి, బాగుండదని, ఆగాను.

మొత్తనికి మరొక మధుర స్మృతిగా ఈ ఏడాది శ్రీ త్యాగరాజ ఆరాధన కార్యక్రమం ముగిసింది. Posted by Murali ( Apr 06 2005, 11:46:43 AM EDT ) Permalink Comments [6]

Comments:

fully enjoyed na

congrats

tirupati lO uMDETappuDu annamayya kaLaaBavanki, mahti ki appuDappuDU veltU uMDE vaaDini, kaanI naaku bottigaa saMgIta ~jnaanaM lEdu ayinaa vinaDaaniki baagaanE uMDEvi!

Posted by Kiran Kumar Chava on April 07, 2005 at 01:32 AM EDT
Website: http://chavakiran.blogspot.com #

Hi,
i would like to know about blogging in telugu.
i have windows 2000 on my machine and there is no way i can change to XP.
is there anyway for me to blog in telugu through my win2000 OS ???

Posted by chaitanya on April 27, 2005 at 09:29 AM EDT #

It is quite possible.

Install yudit from www.yudit.org and start typing

Have a look at tools section of telugu bloggers

enjoy
Kiran Kumar

Posted by chavakiran on April 29, 2005 at 12:08 AM EDT
Website: http://chavakiran.blogspot.com #

Hi Murali,

Not able to read this blog it appears in boxes? Why is this. It appears that few people could read the same? Whats the reason.

Posted by Swamiji on May 05, 2005 at 04:53 AM EDT #

Hi Murali,

Not able to read this blog it appears in boxes? Why is this. It appears that few people could read the same? Whats the reason.

Srinivas J.

Posted by jhansi srinivas on September 29, 2005 at 05:29 AM EDT #

Alright, you need to make your system Unicode compatible. See this link for How-To:

http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

Posted by Murali on October 05, 2005 at 01:23 PM EDT #

Comments are closed for this entry.

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers