Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
« సౌత్ అఫ్రికా మరపురాని గెలుపు! | Weblog | త్యాగరాజ ఆరాధన - 2006 »
20060405 Wednesday April 05, 2006

హైదరాబాదుకు నాసిరకం ఫ్లైట్లు నిన్ననే హైదరాబాదు నుండి, రెండు వారాల ట్రిప్పు తరువాత, తిరిగివచ్చాను.

NW/KLM వారి ఫ్లైట్లులో వెళ్లాను. డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ - హైదరాబాదు, ఇదీ ప్రయాణపు ప్లాను. ఇదివరకు బొంబాయి, మద్రాసు, ఢిల్లీ వగైరా "ప్రధాన" నగరాలలో దిగి తరువాత హైదరాబాదు వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు, ఎంచక్కా హైదరాబాదు వరకు వెళ్లిపోవచ్చు.

డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ విమానం 2మ్మచ్ గా ఉంటుంది. ప్రతి సీటుకు సొంత టీవీ, క్రొత్త సీట్లు వగైరా సకల సౌకర్యాలతో ఉంటుంది. ఆంస్టర్డామ్ - హైదరాబాదు మధ్య నడిచే విమానం ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పలేం. నిన్ననో మొన్ననో decommission చేసిన విమానాన్ని తిరిగి సర్వీసులో పెట్టినట్టుగా ఉంది. అక్కడక్కడా లీక్ అయ్యే ఏసీ, బయట ఇంజను హోరు, కంపుకొట్టే టాయిలెట్లు, విరిగిపోయిన సీట్లు వగైరా వగైరా.

వెళ్లేటప్పుడు ఫర్వాలేదు. తిరుగు ప్రయాణంలోనే వచ్చిపడ్డాయి నాకు చిక్కులు, చిరాకులు. హైదరాబాదు - ఆంస్టర్డామ్ విమానం తెల్లవారిజాము మూడు గంటలకు. నిద్రలేకుండా అర్థరాత్రి విమానాశ్రయానికి వెళ్తే, కుయ్యోమొర్రో అనుకుంటూ తె. 3:40కి బయలుదేరింది. నాకు కూర్చున్న 10ని.లకే నిద్రపట్టేసింది. మెళకువ వచ్చేసరికి అనౌన్సుమెంటు వినపడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో దుబాయ్ లో దిగబోతున్నాము అనుకుంటూ. "ఇదేంట్రా బాబూ గొడవ! హైజాకింగు కాదు కదా!" అనుకున్నా. "We are dumping the fuel and starting the descent" అంటూ మళ్లీ పైలెట్ ప్రకటించాడు. పక్కనున్న అతన్ని అడిగా, "ఏంటి గురూ విషయం?" అని.

"కొన్ని సాంకేతిక కారణాల వలన విమానం కావలసిన అంత ఎత్తుకు ఎగురలేకపోయింది. అందుకునే ఆంస్టర్డామ్(8గం. ప్రయాణం) బదులు దుబాయకే(3గం. ప్రయాణం) లో దింపేస్తారట" అని శెలవిచ్చాడు. అసలు ఆకాశంలో ఎగిరి తాహతులేని విమానాలు హైదరాబాదుకు వేస్తున్నారంటే ఎంత నాసి రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రేప్పొద్దున ఏదో పీకలమీదకొచ్చే విషయం వస్తే కానీ ఈ ఎయిర్లైస్సు వారు మంచి విమానాలు వేయరు కాబోలు.

సరే, దుబాయ్ లో దింపేసిన తరువాత ఈ 300-350 మందిని ఇతర విమానాల్లో సర్దే సరికి 7-8గం. పట్టింది. ప్రొద్దున 6:30గం. దుబాయ్ లో దిగినవాళ్లం సా. 2:45గం. లకు హోటలుకు వెళ్లాం. నేనూ, మరో డజను మంది కలసి హోటలు దగ్గరే తచ్చట్లాడుతున్న ఒక మళయాళీ టూర్ ఆపరేటరును పట్టుకొని సా.6-9 వరకు దుబాయ్ టూర్ చేసాము. మరలా ప్రయాణం మర్నాడు ప్రొద్దున 8:00గం. వెరసి, నాసిరకం విమానాల పుణ్యమా అని దుబాయిలో ఒక రోజు గడిపాను.

దుబాయినుంచి అమెరికాకు ఎమిరేట్స్ వారి విమానంలో వచ్చాను. టాయిలెట్లో ఎంచక్కా "టాయిలెట్ శుభ్రంగా ఉంచుటకు ఈ బటను నొక్కండి" అని హింది, బెంగాలీ, ఉర్దూ వగైరా మరో 6-7భాషలతో సహా, తెలుగులో కూడా వ్రాసుంది. అది నాకు నచ్చింది :)

ఎలాగోలా నేనయితే ఆన్ ఆర్బరు వచ్చి పడ్డాను కానీ నా సామాను ఇంకా ప్రపంచ విహారంలోనే ఉంది. ఎప్పుడొస్తుందో ఏమో?

Posted by Murali ( Apr 05 2006, 05:13:07 PM EDT ) Permalink Comments [2]

Comments:

ఇది కింద రాసిన "మథురా నగరిలో" మీద కామెంటు.
త్యాగయ్య జీవితమ్మీద వచ్చిన రెండు సినిమాలలోనూ ఈ పాట వుంది. నాగయ్యగారి త్యాగయ్య చూసి చాలా యేళ్ళయింది, అందులో పాడిన పాట ఎలా వుందో గుర్తులేదు కాని చిత్రీకరణ - బాగా చిన్న పిల్లలు గోపికా కృష్ణులుగా - చాలా బావుంటుంది. బాపు తీసిన త్యాగయ్యలో సుశీల పాడింది - పరవాలేదు. రెండు సినిమాల్లోనూ ఈ సందర్భంలో కూచిపూడి భాగవతులు త్యాగయ్య గారిని, "స్వామీ, మీరు ఆనందభైరవి రాగంలో కీర్తనలు రాయవద్దు" అని వేడుకున్నట్టు కథ.

Posted by Nasy (199.5.150.66) on April 12, 2006 at 02:25 PM EDT #

I too feel the same with KLM/NW airlanes operated in between HYD and Amsterdam.

Posted by Srinivas Ivaturi on August 10, 2006 at 02:42 PM EDT
Website: http://www.javablogs.net #

Comments are closed for this entry.

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers