Wednesday January 18, 2006
విస్మయపరచిన తెలుగుబ్లాగర్ల ఎన్నిక డిసెంబరులో మొదలైన దేశీయ బ్లాగర్ల పోటీ సంగతి విదితమే.
ఈ వారంలో ఫలితాలు వచ్చాయి. దేశీయబ్లాగర్ల కేటగిరీలో indiauncut.blogspot.com బ్లాగు అత్యుత్తమ
బ్లాగుగా ఎన్నుకోబడినది. పూర్తి వివరాలకు ఇక్కడ http://indibloggies.org/results-2005 చూడండి.
తెలుగుబ్లాగర్ల కేటగిరీలో amazingtelugus.blogspot.comకు
అత్యుత్తమ బ్లాగుగా ఎన్నుకున్నారు. నాకు మటుకూ హృదయపూర్వకంగా "అభినందనలు" తెలియజేయలేకపోతున్నాను. క్షమించాలి.
ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆ బ్లాగు చూసిన గుర్తు. వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన 15-20మంది తెలుగువారి గురించి వ్రాసారు. మంచి ప్రయత్నం. ఏదో పుస్తకంలో చూచి వ్రాసినట్టున్నారు. కానీ తెలుగు నుడికారంలేదు. అంతా ఇంగ్లీషులో వ్రాసారు.
నా ఉద్దేశంలో ఏదైనా ఒక విషయంపై హృదయంలోంచి వచ్చే ప్రతిస్పందనకు అక్షర రూపమే ఒక మంచి బ్లాగు! ఆ ప్రతిస్పందన ఒక నిష్టూరం కావొచ్చు, వ్యంగ్యం, హాస్యం, కోపం, ఆక్రోశం, పాఠం, సరదా, సలహా వగైరా ఏదైనా కావొచ్చు. ప్రతిస్పందన కాకపోయె కనీసం ఒక ప్రతిబింబమయినా కావొచ్చు. రూపం ఏదైనా, అలాటి బ్లాగులు తెలుగులో చాలా లేక పోయినా పదో ఇరవయ్యో ఉన్నాయి. వాటినన్నిటినీ త్రోసిరాజని కేవలం పుస్తకం లో చూచి నాలుగు ముక్కలు వ్రాసిన వారిని ఎన్నుకోవటం సబబా అని ఆలోచించాల్సిన విషయం.
కనీసం వచ్చే ఏడాది, తెలుగు కేటగిరీలో తెలుగు బ్లాగును ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.
Posted by Murali
( Jan 18 2006, 11:08:21 AM EST )
Permalink
Comments [1]
మొదటి రోజు వచ్చిన రెండు బ్లాగులు (మీదీ, తెలుగుతనం వారిదీ) షార్ట్ లిష్ట్ చేయడం మర్చిపోయినాను( due to some technical mistake in the process, but it is too late when I noticed it)
నా పని కేవలం మొదటి ఏడు బ్లాగులు షార్ట్ లిస్టుచేయడం వరకే!
తరువాత కేవలం వోటర్లు ఎన్నిక
బహుశా చదివినవారికి అందరికీ మన తెలుగు యూనీకోడు బ్లాగులు కనిపించలేదేమో, దానితో కనపడ్డ ఒకే ఒక ఇంగ్లీషు బ్లాగును ఉత్తమమైనదిగా ఎన్నుకున్నారేమో!
నా తప్పుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.
మనము ఓ వెయ్యి బ్లాగులు దాటిన తరువాత ఓ మంచి పోటి పెడదాము, బహుశా మిమ్మల్నే న్యాయనిర్ణేతగా ఉంచాలేమో :)
ప్రస్తుతము చిన్నా చితకా అన్నీ కలిపి ఓ రెండు వందలు ఉన్నట్లు ఉన్నాయి.
Posted by Kiran Kumar Chava on January 20, 2006 at 06:27 AM EST
Website: http://www.oremuna.com/blog #