నా మానస గంగా తరంగ భావాలు !

All | General | Status | Java | Music | Politics
20111015 Saturday October 15, 2011

జ్ఞాపకం పండువెన్నెల పరికిణీ పరుచుకున్న నా ప్రియ పారిజాతమా ! రెప్పల వెనుక దాగిన ప్రతిస్వప్నంలోను నీ ఊహల ఊసులే ! నా ప్రతి కన్నీటి బొట్టు నీ జ్ఞాపకాన్నే మోసుకొస్తుంది ! కల చెదిరినప్పుడల్లా కలగా మిగిలిన మన ప్రణయం జ్ఞాపకం ! కన్నీరు జలజల రాలినప్పుడల్లా నీ జ్ఞాపకం తడితడిగా తగులుతుంది ! నీవు కలగా మారి నాకు కన్నీళ్లను మిగిల్చావు ! ఆ కన్నీటి లోనే జ్ఞాపకంగా మిగిలి సదా నాలోనే ఉండిపోయావు ! Posted by fayazca1982 ( Oct 15 2011, 10:21:30 PM GMT+05:00 ) Permalink Comments [0]

20111006 Thursday October 06, 2011

తొలిపరిచయం మధురం మధురం మన తొలిపరిచయం! మధురాతిమధురం మన ప్రణయ కావ్యం! స్వరరాగ రంజితం మన ప్రేమ గీతం! రసరాగ భరితం మన ప్రేమ పయనం! ఓ మధుర జ్ఞాపకం నీతో గడిపిన ఆ క్షణం ! ఓ మరుపురాని అనుభవం నిన్ను చూసిన ఆ తొలిక్షణం!! Posted by fayazca1982 ( Oct 06 2011, 10:23:03 AM GMT+05:00 ) Permalink Comments [0]

20111003 Monday October 03, 2011

ఓ ప్రియతమా! సిరివెన్నెలలో వికసించిన ప్రణయ పారిజాతమా! నా ప్రియతమా! చిరుదరహాసం పల్లవించే కావ్యనాయికవా! నా ప్రియతమా! Posted by fayazca1982 ( Oct 03 2011, 11:16:45 AM GMT+05:00 ) Permalink Comments [0]

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers